తెలిసో.. తెలియకో ఓట్లేస్తే ప్రాణాలు బలిగొంటారా?: చంద్రబాబు

మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వరదల విషయంలో ఏం చేయాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 

‘‘వైకాపా ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో గేట్లన్నీ మొత్తం కొట్టుకుపోయాయి. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది చనిపోయారు. వరదలతో రూ.6వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టమని కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు?

తెలిసో.. తెలియకో.. ఓట్లు వేస్తే ప్రజల ప్రాణాలు బలిగొంటారా?నిర్లక్ష్యంపై న్యాయ విచారణ అడిగితే ఎందుకు అంగీకరించలేదు?ఒక వ్యక్తి 9మందిని ఎక్కించుకొని చాలా వరకు కాపాడాడు. ఏడుగురిని కాపాడగలిగాడు.. శ్వాస ఆడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు’’ అని చంద్రబాబు అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us