నాడు - నేడు పనులు నూరు శాతం పూర్తి కావాలి:కలెక్టర్ మురళీధర్ రెడ్డి

కాకినాడ: 4 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించిన పనులు పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి నూరు శాతం పూర్తికావాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయి పనుల పురోగతిపై జేసీ (డి) కీర్తి చేకూరితో కలిసి ఆయన విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పాఠశాలల్లో పూర్తిగా సమూల మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. తక్కువ సమయం ఉన్నందున పాఠశాలల పునః ప్రారంభించే నాటికి నూరు శాతం నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. జిల్లాలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి మంచి అవకాశంగా భావించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలతో సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు వెళ్లకపోవడం, కొన్ని ప్రాంతాల్లో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులు గురించి అసలు తెలియకపోవడం వంటి విషయాలు క్షేత్రస్థాయి పర్యటనలో తన దృష్టికి వచ్చాయని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించిన కారణంగా క్షేత్రస్థాయిలో అధికారులు పాఠశాల నిర్మాణ పనుల్లో పురోగతి చూపించాలన్నారు. నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి అలక్ష్యం వహించిన ఎమ్ఈవో హెచ్.ఎం, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. జాయింట్ కలక్టర్ (డి) కీర్తి చేకూరి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ లో గుర్తుండిపోయే విధంగా పాఠశాల నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. జిల్లా నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడడానికి వీలు లేదన్నారు. పాఠశాల నిర్మాణ పనుల్లో పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి ప్రాధానోపాధ్యాయుడు ఎస్టిఎమ్ఎస్ యాప్ డౌన్ లోన్ చేసుకుని లాగిన్ అవ్వాలన్నారు. ఈ యాప్ ద్వారా తమ పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనుల బిల్లుల, ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు హెచ్.ఎంలు అప్ లోడ్ చేయాలన్నారు. జిల్లాలో ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు పూర్తి భాద్యత వహించాలన్నారు. స్టాక్ రిజిష్టర్ సక్రమంగా నిర్వహించడంతో పాటు హెచ్ఎమ్ లు విధిగా ప్రతి రోజు బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆమె తెలిపారు. టెక్నికల్ ఇతర సమస్యలు ఉంటే వెంటనే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్ఈవో నిర్లక్ష్యం విడిచి పెట్టి తమ మండల పరిధిలో జరుగుతున్న నాడు-నేడు నిర్మాణ పనులు ప్రతి రోజు పరివేక్షణ చేయాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు ఈ రోజునుండే క్షేతస్థాయి పరిశీలనలు మొదలు పెట్టాలని జెసి కీర్తి చేకూరి తెలిపారు ఈ వీడియోకాన్పరెన్స్ లో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం, ఎస్.ఎస్.ఎ పీవో బి.విజయభాస్కర్ నియోజకవర్గ పరిశీలకులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us