అర్హులైన పేదలకు సీలింగ్ భూములు పంచాలి

UPDATED 12th JUNE 2017 MONDAY 1:00 PM

పెద్దాపురం: అర్హులైన నిరుపేదలకు సీలింగ్ భూములు పంచాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాకుల రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో ఉన్న సీలింగ్ భూములను అర్హులైన నిరుపేదలకు పంచాలన్నారు. గ్రామంలో ప్రజలకు పనులు దొరక్క పస్తులుంటున్నారని, అలాగే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది భూస్వాముల చేతుల్లో ఈ సీలింగ్ భూములు చిక్కుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీలింగ్ భూములను గ్రామంలో ఉన్న 200 నిరుపేద కుటుంబాలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గ్రామంలో విచారణ చేపట్టి పేదలకు భూములను పంచాలన్నారు. అనంతరం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందచేశారు.ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు బి.రమేష్, జిల్లా అధ్యక్షుడు ఏనుగుపల్లి త్రిమూర్తులు, రామకృష్ణ, అబ్బులు, సత్తిరాజు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us