రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

UPDATED 2nd DECEMBER 2020 WEDNESDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): వరదలు,తుఫాన్లు కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం  అండగా ఉంటుందని, రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి రంగు మారిన, దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులు ఎలాంటి ఇబ్బందులుకు గురికాకుండా క్షేత్రస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రంగు మారినట్లు అంచనా వేయడం జరిగిందని అన్నారు.  రంగుమారిన ధాన్యం సేకరణ నిమిత్తం జిల్లాస్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ విధమైన  సమస్యలు తలెత్తినా కాల్ సెంటర్ నెంబర్ 8886613611కి ఫోన్ చేసి తెలియచేయాలని అన్నారు. అలాగే ప్రతీ 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒక ప్రత్యేక బృందం, కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వరదలు, తుఫాన్ల కారణంగా రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రధానంగా బాయిల్డ్  రైస్ మిల్లర్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా  వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కేవీఎస్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్లు వి.టి. రామారావు, యస్. మాధవరావు, మండలస్థాయి వ్యవసాయశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us