నాణ్యమైన విద్యాబోధన అందించడమే ఆదిత్య లక్ష్యం

UPDATED 3rd JULY 2017 MONDAY 5:00 PM

గండేపల్లి: నాణ్యమైన విద్యాబోధన అందించడమే ఆదిత్య విద్యాసంస్థల లక్ష్యమని సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యుత్తమ విద్యాభోధనతో పాటు క్రమశిక్షణ, నాణ్యమైన విద్యను అందించడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తుకు, వారి అభివృద్ధికి సంస్థ విశేష కృషి చేస్తుందన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి సహకరించాలని కోరారు. అనంతరం సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన విద్యను అందించడానికి తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్ఐటి ల్లో పనిచేసిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. తమ కళాశాలలో విద్యను అభ్యసించిన ఎన్నో వేలమంది విద్యార్థులు దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, కళాశాల క్యాంపస్ డైరెక్టర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ కె.వి.ఎస్.జి. మురళీ కృష్ణ, హెచ్ వో డి లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us