చెవిలో బ్లూటూత్‌.. విగ్గు కింద చిప్‌.. ఎస్సై పరీక్షలో హైటెక్‌ కాపీ..!

లఖ్‌నవూ (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: పోలీసుగా ఉద్యోగం సంపాదించి నేరస్థులు, మోసగాళ్లను పట్టుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం పోలీసు అయ్యేందుకే ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షలో హైటెక్‌ పద్ధతిలో కాపీ కొట్టేందుకు యత్నించాడు. అతడి అతి తెలివికి పోలీసులే నివ్వెరపోయారు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఎస్సైల ఎంపికకు రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు ఓ అభ్యర్థి చెవిలో అతి చిన్న బ్లూటూత్‌ పెట్టుకుని వచ్చాడు. ఈ బ్లూటూత్‌ను కనెక్ట్‌ చేసే చిప్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను విగ్‌కు అమర్చి పెట్టుకున్నాడు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా మెటల్‌ డిటెక్టర్‌కు చిక్కాడు. పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లే సమయంలో మెటల్‌ డిటెక్టర్‌ సాయంతో అతడిని తనిఖీ చేయగా.. ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సిబ్బంది రెట్టించి అడగడంతో అసలు విషయం బయటపెట్టాడు. పోలీసులు విగ్గు తీసి చూడగా.. అందులో చిప్‌ దర్శనమిచ్చింది. ఇక బ్లూటూత్‌ కన్పించకుండా ఉండేందుకు వాటిని చెవిలో చాలా లోపలికి అమర్చుకున్నాడు. వాటిని బయటకు తీసేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చిందట. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ ఇటీవల ట్విటర్‌లో పంచుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అతడి హైటెక్‌ కాపీని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతకంటే చదువుకోవడమే సులువు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us