TTD: వీఐపీలకు టీటీడీ విజ్ఞప్తి.. వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు పంపొద్దు

తిరుమల (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీకి సహకరించాలని ఆయన కోరారు. పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలో ని నందకం, వకుళ ఆథితి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని చెప్పారు. తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతి లోనే బస చేసేందుకు సిద్ధపడి రావాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీపద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని టీటీడీ ఛైర్మన్‌ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us