UPDATED 30th APRIL 2018 MONDAY 5:00 PM
సామర్లకోట: స్థానిక బ్రౌన్ పేట టీచర్స్ కాలనీలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రార్ధనా కూడికలు కార్యక్రమంలో భాగంగా సుమారు 80 మందికి పేద వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. పొంగు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి (బాబు) హాజరయ్యారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ పేదవారికి సమాజంలో సహాయం అందిస్తే వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు దోహదపడతాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుటుందని అన్నారు. ఎలాంటి అవసరం వచ్చినా మాకు తెలియచేస్తే మా వంతు సహాయం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కడలి ఈశ్వరి, కడలి శివ, పెంకే వెంకటలక్ష్మి, సరోజ వాసు,షేక్ సూరజ్, దాసరి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.







