కడియం నర్సరీలను సందర్శించిన డీజీపీ

UPDATED 15th JUNE 2017 THURSDAY 5:00 PM

కడియం: రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు గురువారం తూర్పుగోదావరి జిల్లా కడియంలోని నర్సరీలను సందర్శించారు. ఇందులో భాగంగా ముందుగా సత్యదేవ, పల్ల వెంకన్ననర్సరీలను సందర్శించారు. ఆయనకు ఐఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి పుల్లా వీరవెంకట్రావు, కేఎన్‌ఏ అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీపీ నర్సరీలో తమకు కావాల్సిన మొక్కల వివరాలను తెలుసుకున్నారు.  నర్సరీ యజమాని పల్ల వెంకన్న, ఐఎన్‌ఏ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తదితరులు డీజీపీకి నర్సరీలోని వివిధ రకాల మొక్కల వివరాలు, వాటిని ఏవిధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయాలను గురించి చెప్పారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేయబోయే పోలీసు కార్యాలయాల్లో నాటే మొక్కల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. తమ కార్యాలయ వాతావరణంలో నాటే మొక్కలు సిబ్బంది మనసుపై పనిచేస్తాయని అందువల్ల ఆహ్లాదాన్ని కలిగించే మొక్కలను ఏర్పాటుచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డీఐజీ రామకృష్ణ, రాజమహేంద్రవరం పోలీసు అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us