Shankara Vijayendra Saraswathi : ధర్మాన్ని ఆచరించడం సాధనగా ప్రారంభించాలి

UPDATED 8th OCTOBER 2022 SATURDAY 08:00 PM

Shankara Vijayendra Saraswathi : ధర్మాన్ని ఆచరించడం సాధనగా ప్రారంభించాలని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి (Shankara Vijayendra Saraswathi) అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో లలితా ఇండస్ట్రీస్ (Lalitha Industries ) అధినేతలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ప్లీడర్స్ వీధిలో ఉన్న వారి నివాసం వద్ద నిర్వహించిన సత్యంవద, ధర్మంచర కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు, భక్తులనుద్దేశించి స్వామివారు అనుగ్రహభాషణ చేశారు.

ధర్మాన్ని ఆచరించడం సాధనగా ప్రారంభించాలని, అప్పుడే ధర్మబద్దమైన జీవితాన్ని ప్రారంభించగలుగుతామని అన్నారు. ఎప్పుడైతే సత్యాన్ని ఆచరిస్తామో అప్పుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడప గలుగుతామన్నారు. సత్యాన్ని పాటించడం నిజమైన ధర్మమన్నారు. చిన్న వయసు నుంచే ధర్మాన్ని ఆచరించడం నేర్చుకోవాలని... కేవలం ఒక వ్యక్తిగా కాకుండా సమిష్టిగా దేశం మొత్తం పురోగతి సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఎక్కడైతే హృదయంలో ధర్మం ఉంటుందో శీలం ఉన్నతంగా ఉంటుందన్నారు. అలాగే సంపన్న వర్గాలు దేశవ్యాప్తంగా కంచి మఠం విస్తరణకు సహకరించాలన్నారు.

ఈకార్యక్రమంలో ఏపీ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఆల్ ఇండియా రైస్ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బండా వెంకట కృష్ణ, కోనసీమ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామన్న చౌదరి, తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నల్లమిల్లి బులిమోహనరెడ్డి, అప్ ల్యాండ్ ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు, మురళీమోహనా బాయిల్డ్ రా రైస్ మిల్ అధినేత చింతా పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us