Venkatesh: హిట్ డైరెక్టర్‌తో వెంకీ మూవీ.. నిజమేనా?

Updated 22nd December 2022 Thursday 6:30 pm

Venkatesh: స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. తన వయసు తగ్గ పాత్రలు తనకు సెట్ అయితేనే ఆ సినిమాను ఓకే చేస్తూ వస్తున్నాడు ఈ హీరో. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఓ మై గాడ్’లో ఓ కేమియో పాత్రలో నటించాడు వెంకీ. ఇక తన నెక్ట్స్ సినిమాను వెంకటేష్ ఎవరితో చేస్తాడా అనే ప్రశ్నకు త్వరలోనే యాన్సర్ దొరకబోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల హిట్-2 సినిమాతో తన ట్యాలెంట్ ఏమిటో ప్రూవ్ చేసుకుని మరో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను, తన హిట్ వర్స్‌లో వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇటీవల స్టార్ హీరో వెంకటేష్‌కు శైలేష్ కొలను ఓ కథను వినిపించగా, అది నచ్చిన వెంకీ వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పాడట. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ సినిమాను పట్టాలెక్కించాలని శైలేష్ భావిస్తున్నాడట. దానికోసం మరికొంత సమయం తీసుకుంటాడట ఈ యంగ్ డైరెక్టర్.

ఇక ఈ సినిమాను నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాను 2023 ప్రథమార్థంలో ప్రారంభించి, రెగ్యులర్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని.. అటుపై ఈ సినిమాను వచ్చే ఏడాది చివరికల్లా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us