అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని దారుణంగా ధ్వంసం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు టాయిలెట్లు కట్టలేని సీఎం జగన్ 3 రాజధానులు కడతారా? అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో యాచిస్తోందని.. ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని వైసీపీ నేతలు కేంద్రాన్ని వేడుకుంటున్నారని వెల్లడించారు. హోదా, అమరావతి, పోలవరం గురించి అడగటం లేదని ఆక్షేపించారు. సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమైందని చంద్రబాబు నిలదీశారు. హామీ నెరవేర్చని జగన్ ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లిలా సీఎం జగన్ వైఖరి ఉందంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.







