UPDATED 18th DECEMBER 2017 MONDAY 6:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామం శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ వింజమూరి వెంకట కామేష్ ను ఘనంగా సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కామేష్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆయనను జ్ఞాపిక, దుశ్శాలువతో ఘనంగా సత్కరించి శుభాభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ, సమితి అధ్యక్షులు టి.గంగాధర్, సభ్యులు కె.సతీష్, జి.ప్రకాష్, కూనిరెడ్డి శ్రీనివాసరావు (రావు), తొగరు శ్రీనివాసు, కె. ఆనంద మోహన్, తదితరులు పాల్గొన్నారు.







