ప్రజా సంక్షేమ పాలనే టిడిపి ప్రభుత్వ లక్ష్యం

UPDATED 20th JUNE 2017 TUESDAY 6:00 PM

సామర్లకోట: ప్రజా సంక్షేమ పాలనే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో భాగంగా రూ.30  లక్షలు వ్యయంతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. అలాగే రెండు అంగన్వాడీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. దాతల సహకారంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు, పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో బాలికలకు సైకిళ్ళు అందచేశారు. అలాగే గ్రామంలో కాలనీలను సందర్శించి ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి గొడతా మార్త , జెడ్పిటిసి గుమ్మళ్ల విజయలక్ష్మి, వైస్ ఎంపిపి ఎ. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us