Updated 20th February 2023 Monday 6:10 pm
Gannavaram : గన్నవరంలో (Gannavaram) వైసీపీ శ్రేణులు (YCP leaders) రెచ్చిపోయాయి. విధ్వంసం సృష్టించాయి. గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.
ఈ దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అనుచరులే చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు ఉండగానే చూస్తుండగానే వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులను అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించడం గమనార్హం. టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని టీడీపీ అంటున్నారు. పోలీసులు అలసత్వమే కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.







