UPDATED 3rd MARCH 2018 SATURDAY 7:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవోపై తహసీల్దార్ గోగుల వరహాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలును స్థానికంగా కాకుండా దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడం, స్థానికంగా తక్కువ కొనుగోళ్లు చూపి, దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ మోతాదులో కొనుగోలు చేయడంపై ఆయన అనుమానం వ్యక్తం చేసి శనివారం రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగులు రికార్డుల అస్తవ్యస్త నిర్వహణపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.







