REDBEENEWS
అశోకవనంలో అర్జున కళ్యాణం’లోని ‘ఓ ఆడపిల్లా’ అంటూ సాగే బ్యూటిఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. సాధారణంగా ఒక సినిమా పాటల విడుదలకు ముందే ప్రేక్షకాదరణ పొందితే.. సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్లే అంటుంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్లు. ఒకప్పుడు ఆడియో రిలీజ్, క్యాసెట్స్, సీడీలు వంటి హంగామా ఉండేది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేసేస్తున్నారు... అదికూడా ఒక్కో పేరుతో ఒక్కో పాట.. ఇలా విడుదల చెయ్యడం వల్ల ఆడియన్స్‌కి రీచ్ అవడమే కాక చార్ట్ బస్టర్‌గా నిలుస్తున్నాయి కొత్త సినిమాల పాటలు. ఇప్పుడు నెట్టింట ఓ బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ చక్కర్లు కొడుతోంది.
యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా.. విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’..
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమా నుండి ‘ఓ ఆడపిల్లా’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. జయ్ ప్రకాష్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, అనంత శ్రీరామ్ అందమైన పదాలు రాశారు. యంగ్ సింగింగ్ సెన్సేషన్ రామ్ మిర్యాల అంతే చక్కగా పాడారు...మాటరాని మాయవా.. మాయజేయు మాటవా.. మాటులోని మల్లెవా.. మల్లె మాటు ముల్లువా.. ‘ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా?.. నా జీవితంతో ఆటాడుతావా?’.. వంటి లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. త్వరలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రేక్షకుల ముందుకు రానుంది..







