ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఇంకా పట్టిపీడిస్తున్న వేళ అఫ్గానిస్థాన్‌కు భారత్ మానవతా దృక్పథంతో తన వంతు సహకారం అందించింది. ఆ దేశానికి 5లక్షల డోసుల కొవాగ్జిన్ టీకాలను శనివారం పంపింది. కాబూల్‌లోని ఇందిరాగాంధీ పిల్లల ఆస్పత్రికి ఈ టీకాలను అప్పగించింది. తాలిబన్లు ఆక్రమణకు పాల్పడంతో చెలరేగిన యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్గానిస్థాన్‌కు మరికొన్ని వారాల్లో మరో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్‌ని పంపిణీ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.







