ప్రగతిలో ఘనంగా ప్రారంభమైన స్ట్రైడ్స్ 2కె18 వేడుకలు

UPDATED 6th MARCH 2018 TUESDAY 10:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే జాతీయస్థాయి సాంకేతిక సదస్సు  స్ట్రైడ్స్ 2కె18 వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.  మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఈసీఈ విభాగం ఎజివ్ 2కె18, సిఎస్ఇ విభాగం ఎప్రోజైన్ 2కె18, పేరిట జాతీయస్థాయి సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కాకినాడ జె.ఎన్.టి.యు ఏపీపీఎస్సి సభ్యులు డాక్టర్ కె. పద్మరాజు, ప్రొఫెసర్ డాక్టర్ ఎం.హెచ్.ఎం. కృష్ణ ప్రసాద్ హాజరైనారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న సాంకేతిక, నిర్మాణాత్మక నైపుణ్యాలనుఁ ప్రదర్శించడానికి తమ కళాశాల నిర్వహిస్తున్న స్ట్రైడ్స్ 2కె18 ఒక చక్కని వేదికని అన్నారు. ముఖ్య అతిథులు డాక్టర్ పద్మరాజు, ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు అధిరోహించాలంటే విద్యార్థులు తమ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా వినియోగిస్తూ మానవాళి పురోగతికి ఉపయోగపడేవిధంగా సాంకేతిక కార్యక్రమాలను రూపకల్పన చేయాలన్నారు. ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న సాంకేతిక సదస్సు ప్రపంచవ్యాప్తంగా మార్పుచెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకోవడానికి దోహదపడడమే కాకుండా ప్రపంచానికి అవసరమైన భావిభారత ఇంజినీర్లను తీర్చిదిద్దడంలో విశేషంగా సహకరిస్తుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ సాంకేతిక రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకుంటూ నేటి పోటీ ప్రపంచంలో విశ్వవిజేతలు కావాలని సూచించారు. కార్యక్రమ కన్వీనర్ సి.హెచ్. వసంతలక్ష్మి మాట్లాడుతూ తమ కళాశాల ప్రతీ సంవత్సరం స్ట్రైడ్స్ పేరిట జాతీయ సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులని వివిధ విభాగాలలో నిర్వహించే పలు అంశాలకు ఎంపిక చేశామన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వివిధ కార్యక్రమాలకు విచ్చేసిన అభ్యర్థుల నుంచి 120 పేపర్ ప్రెజంటేషన్స్,74 పోస్టర్ ప్రెజంటేషన్స్,190 ప్రాజెక్ట్ ప్రెజంటేషన్స్,111 టెక్నికల్ క్విజ్ అంశాలను తుది పోటీకి ఎంపిక చేయడంతోపాటు నేటి కార్యక్రమంలో భాగంగా టోటల్ స్టేషన్స్ పేరిట నిర్వహిస్తున్న ఒక రోజు వర్క్ షాప్ కు 621 ఎంట్రీలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు ఎజివ్ 2కె 18, ఎప్రోజైన్  2కె18, సావనీర్లను  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us