Aadavallu Meeku Johaarlu : థియేటర్లలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’..

Aadavallu Meeku Johaarlu: యంగ్ హీరో శర్వానంద్ – కన్నడ చిన్నది రష్మిక మందన్న జంటగా.. హిట్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’..
 

సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద అంచనాలున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 
శుక్రవారం ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి కెమెరా : సుజిత్ సారంగ్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : పీటర్ హెయిన్స్..
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us