కోస్తా పరిరక్షణలో కోస్ట్ గార్డ్ సేవలు అభినందనీయం

* ఆకట్టుకున్న విన్యాసాలు 
* కోస్ట్ గార్డ్ డే ఎట్ సి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా
 UPDATED 18th FEBRUARY 2018 SUNDAY 6:00 PM
కాకినాడ: కోస్తా ప్రాంత పరిరక్షణలో కోస్ట్ గార్డ్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇండియా కోస్ట్ గార్డ్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన డే ఎట్ సి కార్యక్రమంలో  కలెక్టర్ కార్తికేయ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత పరిరక్షణకు కోస్ట్ గార్డ్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వీటిలో భాగంగా కోస్ట్ గార్డ్ నౌకలు వివిధ రకాల సౌకర్యాలు, సమగ్రమైన సమాచార వ్యవస్థ కలిగి తీరప్రాతంలో గస్తీ నిర్వహించి రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిశ్రా, పోర్ట్ డైరెక్టర్ కె. ప్రవీణ్, ఇంత అధికారులు విశాఖపట్నం నుంచి వచ్చిన ఐ.సి.జి.ఎస్ షానాక్ నౌకలో సముద్రంలో పర్యటించి కోస్ట్ గార్డ్ చేస్తున్న సేవలను పరిశీలించారు. సముద్రంలో గస్తీ నిర్వహించడం, సమాచార వ్యవస్థను వినియోగించడం, ప్రమాదాలలో ఉన్నవారిని హెలికాఫ్టర్ల ద్వారా రక్షించడం వంటి విన్యాసాలు పలువురిని  విశేషంగా ఆకట్టుకున్నాయి. కోస్ట్ గార్డ్ కుటుంబాల డే ఎట్ సి కార్యక్రమాన్ని కలెక్టర్ సతీమణి శ్రేయా దూబే కేక్ కట్ చేసి ప్రారంభించారు. కాకినాడ కోస్ట్ గార్డ్ కమాండెంట్ పి.శ్యాం కుమార్ ఐసిజిఎస్ షానాక్ నౌక గురించి వివరాలు తెలియచేస్తూ అత్యాధునికమైన ఈ నౌకలో ఇంటిగ్రేటెడ్ మిషనరీ కంట్రోల్ సిస్టం, పవర్ మేనేజ్మంట్ సిస్టం, హై పవర్ ఫైర్ ఫైటింగ్ సిస్టం, యాంటీ షిప్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఫైరింగ్ సౌకర్యాలు కలిగి ఉన్నాయన్నారు. ఈ నౌకలోని  ఆయుధాలు, సెన్సార్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ సౌకర్యాల ద్వారా తూర్పు తీర పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున, కాకినాడ కస్టమ్స్ శాఖ జాయింట్ కమీషనర్ ఎస్. నరసింహారెడ్డి, రాజమహేంద్రవరం, రంపచోడవరం సబ్ కలక్టర్లు సాయికాంత్ వర్మ, వినోద్ కుమార్, చింతూరు ఐటిడిఎ పీవో అభిషిఖ్త్ కిషోర్, కాకినాడ సి పోర్ట్ సిఈవో, ఐసిజిఎస్ షానాక్ నౌక పైలట్లు టి.శశికుమార్, వివేక్ సూర్య, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us