Updated 13th April 2017 Thursday 8:10AM
Redbeenews : పట్టణాలు, నగరాల్లో, గ్రామాలలో ఎటు చూసినా సెల్ టవర్లు! దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా సెల్ టవర్లు! అవి వెలువరించే విద్యుదయస్కాంత ధార్మికత హానికరమని సామాజిక, పర్యావేరణవేత్తలు! ‘అబ్బే అదేం లేదు!’ అని ప్రభుత్వాలు, మొబైల్ కంపెనీలు! వీటిపై వాద, ప్రతి వాదాలు అలా ఉండగానే... ‘ఆరోగ్యానికి హానికరం’ అంటూ సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఓ సెల్ టవర్‌ను తొలగించాలని ఆదేశించింది. 42 సంవత్సరాల కేన్సర్ రోగి వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ... ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘నేను పని చేస్తున్న ఇంటి పక్కనే బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ 2002లో అక్రమంగా నిర్మించిందని,14 సంవత్సరాలుగా ప్రతి నిత్యం సెల్‌టవర్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత ధార్మికతకు గురవడం వలన నాకు కేన్సర్ వచ్చింది’’ అని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన హరీశ్‌చంద్ తివారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను పనిచేసే ఇంటికి 50 మీటర్లలోపే ఈ టవర్ ఉందని, మొబైల్ టవర్‌ను తొలగించాల్సిందిగా ఆదేశించాలని కోరారు. దీనిపై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హరీశ్‌చంద్ తివారీ కేన్సర్ కారణమైన సెల్ టవర్‌ను ఏడు రోజుల్లోపు తొలగించాలని (డీయాక్టివేట్) ఆదేశించింది. ఇలా ఒక మొబైల్ టవర్‌ను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఇదే మొట్టమొదటిసారి కావడం గమనార్హం.







