అతిరాత్ర యాగ క్రతువుకు వాస్తు పూజ

UPDATED 23rd MARCH 2018 FRIDAY 7:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక పాండవుల మెట్ట సమీపంలో ఏప్రిల్ 14 నుంచి నిర్వహించ తలపెట్టిన అతిరాత్ర ఉత్క్రుష్ట స్రౌత సోమయాగ క్రతువుకు సంబంధించి వాస్తుపూజా కార్యక్రమం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. యాగకర్త కేశాప్రగడ హరనాథశర్మ పర్యవేక్షణలో సహాయ యాగకర్త కేశాప్రగడ రాజశేఖరశర్మ ఈ వాస్తు పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, నవగ్రహ పూజ, వాస్తు కలశస్థాపన మొదలైన పూజాదికాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం నవధాన్యాలను భూమిపై చల్లారు. ఈకార్యక్రమంలో బొగ్గవరపు నాగేశ్వరావు, వెంకట రామకృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us