మానోజి చెరువుకు మహర్దశ

UPDATED 14TH MAY 2017 SUNDAY 6:30 PM

పెద్దాపురం : భూగర్భ జలాలను పెంపొందించేందుకు రాష్ట్ర పభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానం సమీపంలో ఉన్న మానోజి చెరువు అభివృద్ధి పనులను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నీరు-చెట్టు పథకాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మానోజి చెరువులో పూడిక తొలగించి చెరువును సుందరరీకరణ చేపట్టి వాకింగ్ ట్రాక్, లైటింగ్, గట్లు పై మొక్కలు పెంచి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. జెడ్పి చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గాన్ని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విశేషంగా అభివృద్ధి దిశలో దూసుకుపోయేలా రూపుదిద్దుతున్నారన్నారు. అనంతరం దేవస్థానం సమీపంలో నిర్మిస్తున్న యాత్రికుల విశ్రాంతి భవనాన్ని వారు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి), మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, సామర్లకోట ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, పెద్దాపురం టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us