ఘనంగా ముగిసిన సత్యదేవుని ఆవిర్భావదినోత్సవాలు

UPDATED 26th JULY 2017 WEDNESDAY 11:30 PM

అన్నవరం: రత్నగిరిపై గత మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్నశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి 127వ ఆవిర్భావ దినోత్సవాలు(జయంత్యుత్సవాలు) బుధవారంతో ఘనంగా ముగిశాయి. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల వరకూ స్వామి, అమ్మవార్ల మూలవిరాట్‌లకు పంచామృతాభిషేకం, ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో ఆయుష్యహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్, పాలకమండలి సభ్యుడు అవసరాల వీర్రాజు, ఇన్‌చార్జి ఈవో ఈరంకి జగన్నాథరావు పాల్గొన్నారు. కాగా సత్యదేవుని సన్నిధిలో భక్తులు, అర్చక, పురోహిత, సిబ్బంది వలన తెలిసీ తెలియక జరిగే అపచారాల నివృత్తికి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు కూడా బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పవిత్రాలను (చేతులకు కట్టుకునే కంకణాల వంటివి) స్వామి సన్నిధిలో ఉంచి పూజలు చేసి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, యనమండ్ర శర్మ అవధాని, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్‌ గ్రేడ్‌ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, తదితరులు ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us