రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యుడు నాగాబత్తులకు ఘన సన్మానం

UPDATED 30th JULY 2017 SUNDAY 6:00 PM

కాకినాడ: రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యుడు నాగాబత్తుల శ్రీనివాసరావుకు ఆదివారం కాకినాడ ఆర్&బి అతిధిగృహంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి కమీషన్ చైర్మన్ కారెం శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజన పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ సముచితమైన ఉన్నత పదవులను కల్పించారన్నారు. దళిత నేతలుగా తనతో పాటు నక్కా ఆనందబాబు, జూపూడి ప్రభాకరావు, పుష్పరాజ్, డొక్కా మాణిక్ వర ప్రసాద్, వర్ల రామయ్య, సాల్మన్ మొదలైన వారికి ముఖ్యమంత్రి ఉన్నత అవకాశాలను కల్పించారన్నారు. అనంతరం ఫుడ్  కమీషన్ సభ్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా పార్టీ క్రియాశీల సభ్యుడిగా చేసిన ప్రజాసేవను గుర్తించి ముఖ్యమంత్రి తనకు కమీషన్ సభ్యుడుగా కీలకమైన పదవి అప్పగించారని, తనపట్ల చూపిన ఆదరణ నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలియచేసారు. ఫుడ్ సెక్యూరిటీ  చట్టం ఆశయాలను సాకారం చేస్తూ పేదలకు నాణ్యమైన ఆహారం అందించి తనకు అప్పగించిన పదవీ బాధ్యతలకు న్యాయం చేస్తానన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us