రెడ్ బీ న్యూస్, 18 డిసెంబర్ 2021: మైదానంలో ఫుట్‌బాట్ ఆడుతున్న ప్రతి క్రీడాకారుడికి గోల్ చేయాలని కోరిక ఉంటుంది. ఇక గోల్ చేస్తే ఆ సంబురాలు మిన్నంటిపోతాయి. ఇక్కడా అదే జరిగింది. కానీ గోల్ చేసింది క్రీడాకారుడు కాదు.. ఓ జింక. ఫుట్‌బాల్ ఆటను ఎక్కడ చూసిందో తెలియదు కానీ.. అచ్చూ ఫుట్‌బాల్ క్రీడాకారుడి మాదిరి ప్రవర్తించడం గమనార్హం. మైదానంలోని ఫుట్‌బాల్‌ని డ్రిల్ చేసుకుంటూ వెళ్లి గోల్‌పోస్ట్‌లోకి తరలించింది. అంతటితో ఆగకుండా గెంతుతూ సంబురాలు చేసుకోవడం విశేషం. 2019లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియోను పర్యావరణవేత్త స్టీవర్ట్ విలియమ్స్ శుక్రవారం ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఎక్కడ జరిగింది అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్ నెట్టింట తెగ వైరలవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఆ జింకకు ఫుట్‌బాట్ శిక్షణ ఎవరిచ్చారబ్బా? అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఈ క్లిప్పింగ్‌ను దాదాపు 26 మిలియన్ల మంది వీక్షించారు. 73వేల మంది లైక్ చేయగా.. 15వేల మంది రీ ట్వీట్ చేశారు. ఆ వీడియోను మీరూ వీక్షించండి..







