Pawan Kalyan : ‘పాపం పసివాడు’ సినిమాని సీఎం జగన్‌తో తీస్తే బాగుండు .. ఎందుకంటే ఆయన చాలా అమాయకుడు

Updated 17th May 2023 Wednesday 10:20 am

Janasena Pawan Kalyan : సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ‘పాపం పసివాడు’ సినిమాను మన సీఎంతో ఎవరైనా తీస్తారని ఆశిస్తున్నా అంటూ వి. రామచంద్రరావు దర్శకత్వంలో 1972 సెప్టెంబరు 29న విడుదలైన చిత్రం పోస్టర్ ను కూడా పవన్ పోస్ట్ చేశారు. మన సీఎం చాలా అమాయకుడు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు పవన్. ప్రియమైన సీఎం మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా.. తరిమెల నాగిరెడ్డి కాదు అంటూ ఎద్దేవా చేశారు. ‘క్లాస్ వార్’ అనే పదాన్ని ఉఛ్చరించే నైతిక హక్కు మీకు లేదు అంటూ పవన్ సెటైర్లు వేశారు. ఏదోక రోజు మీనుంచి మీ గుంపు బారి నుంచి రాయలసీమ విముక్తి అవుతుందని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

అతని చేతిలో ‘సూట్‌కేస్’కి బదులుగా, అతను అక్రమంగా సంపాదించిన సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసే బహుళ ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచండి అని అంటూ ఎద్దేవా చేశారు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో ‘వర్గయుద్ధం’ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదన్నారు పవన్ కల్యాణ్. ఏదో ఒక రోజు ‘రాయలసీమ’ మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తమవుతుందని ఆశిస్తున్నాను అంటూ పవన్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us