కొబ్బరి రైతులను ఆదుకునేందుకు అండగా ప్రభుత్వం : మంత్రి కన్నబాబు

కాకినాడ,25 మే 2020 (రెడ్ బీ న్యూస్): కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కురసాల కన్నబాబు తెలియజేశారు.స్థానిక రమణయ్యపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కె.చిట్టిబాబు కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలను మంత్రి కన్నబాబు దృష్టికి సోమవారం తీసుకువచ్చారు. అదేవిధంగా కొబ్బరి రైతుల దిగుబడులు, ధరలు లేక పడుతున్న ఇబ్బందులను మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కొబ్బరి ధరలు పడిపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం నుండి నాఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికారులను ఆదేశించారు. కోనసీమలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొబ్బరితో పాటు ఆయిల్ ఫామ్, కోకోలపై తెల్ల దోమ ఎక్కువగా ఆశించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దీని నివారణకు ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరిని చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. అలాగే కొబ్బరి రైతుల సమస్యలపై ఎఫ్.పీ.వోలతో మాట్లాడారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us