Indrakeeladri : వసంత నవరాత్రోత్సవాలు.. ఒక్కోరోజు ఒక్కోరకం పుష్పాలతో అర్చన

UPDATED 29 MARCH 2022 TUESDAY 08:00 PM

Vasanta Navaratri Utsavalu 2022 : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. దసరా రోజున భక్తులతో సందడిగా మారుతుంటుంది. కానీ.. కరోనా కాలంగా.. కొన్ని ఆంక్షలు, నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. భక్తులు లేకుండానే కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి.

దీంతో ప్రభుత్వం నిబంధనలు, ఆంక్షలను సడలించింది. దేవాలయాల్లో భక్తులను అనుమతినిస్తున్నారు.దీంతో భక్తుల సమక్షంలో పూజలు, ఇతరత్రా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఏప్రిల్ 02వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభతో అలరారనుంది.

రెండో తేదీన ఉగాది పండుగ, పదో తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు, 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. శ్రీ గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు ప్రతిరోజు రకరకాల పూలతో ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించనున్నారు. ఉగాది పండుగ సందర్భంగా.. ఏప్రిల్ రెండో తేదీన తెల్లవారుజామున మూడు గంటల నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకారం, అర్చన, నివేదన, హారతి తదితర కార్యక్రమలను అర్చకులు నిర్వహించనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us