అంతర్వేది (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ డీసీ విజయరాజు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గురువారం వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ముహూర్తపు పత్రాన్ని స్వామివారి చెంతన పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయశాఖ డీసీ విజయరాజ్, ఏసీ భద్రాజీకి అందజేశారు. ఫిబ్రవరి 8న రథసప్తమితో ఉత్సవాలు ప్రారంభం, 11న అర్ధరాత్రి గం.12.35కు దివ్య కల్యాణం, 12న స్వామిరథోత్సవం, 16న చక్రస్నానం, 17న తెప్పోత్సవం, 9, 10, 13, 14, 15న ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవాలు ప్రత్యేక పూజలు జరుగుతాయని వివరించారు. ఆలయ ఛైర్మన్ రాజా కుమార రామ బహుదూర్, ఎంపీపీ వీరామల్లిబాబు, ఈవోలు వెంకటేశ్వరరావు, జి.ప్రసాద్ పాల్గొన్నారు.







