UPDATED 12th JULY 2017 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: హరిత విప్లవ పితామహుడు ప్రముఖ ఆర్థికవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ కుమార్తె మధురా స్వామినాథన్ స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ కు బుధవారం విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె ఆసియాలో దేశాలకు ఆహార భద్రత, పోషక విలువలు ఎలా అందచేయాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు తెలిపారు. ఆర్ధిక శాస్త్రంలో విద్యార్థుల ప్రతిభా పాటవాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. విజయ ప్రకాష్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించడంతో పాటు అత్యుత్తమ విద్యాభోధన అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పి.సందీప్ (ఐఐఎం కోలకత్తా), పాఠశాల డీన్ బి. రాజేశ్వరి , ప్రిన్సిపాల్ మూర్తి, ప్రొఫెసర్ సంతానం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







