యాంకర్‌ అనుసూయ ఇంట విషాదం!

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్)‌ 5 డిసెంబర్ 2021: ప్రముఖ యాంకర్‌, నటి అనుసూయకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి సుదర్శన్‌ రావు(63) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. సుదర్శన్‌ రావు కాంగ్రెస్‌ పార్టీలో చాలాకాలం పాటు పనిచేశారు. రాజీవ్‌ గాంధీ హయాంలో యూత్‌ కాంగ్రెస్‌ పబ్లిసిటీ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయన మృతితో అనుసూయ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.

 

అనసూయ తండ్రి సమాజసేవలోనూ ముందుండేవారు. తండ్రి మరణంతో యాంకర్ అనసూయ తీవ్రం విషాదంలోకి వెళ్లిపోయింది. విషయం తెలిసినప్పటి నుంచి కన్నీరు పెడుతూనే ఉంది ఈమె. పలువురు జబర్దస్త్ నటులతో పాటు సినీ ప్రముఖులు కూడా అనసూయ భరద్వాజ్ ఇంటికి చేరుకుంటున్నారు. నాగబాబు, రోజా కూడా అనసూయకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. వాళ్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us