విద్యార్థులు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

UPDATED 18th SEPTEMBER 2017 MONDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో భారతదేశంలో ప్రపంచ సాంకేతిక అంతరాయం, ఉద్యోగావకాశాల ప్రభావం అనే అంశంపై ముఖాముఖి కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఐటి శాఖ ముఖ్య సలహాదారు జె.ఏ. చౌదరి, ప్రోగ్రెస్ సాఫ్ట్ వేర్ కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ లోగనాధన్, prinesoftinic .com సీఈవో నాగరాజు ఆళ్ళ, ఆంధ్రప్రదేశ్ ఐటీఏ చైర్మన్ కృష్ణారెడ్డి లకు ఆదిత్య విద్యా సంస్థల  ఛైర్మన్, వైస్ చైర్మన్లు నల్లమిల్లి శేషారెడ్డి, సతీష్ రెడ్డి  ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతటి గొప్ప ప్రముఖులు తమ సంస్థను సందర్శించడం తమ సంస్థకే  ఎంతో గర్వకారణం అన్నారు. అనంతరం విద్యార్థులతో సమావేశమైన ఐటి ముఖ్య సలహాదారు జె.ఏ. చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు జరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ విజ్ఞాన పరిధిని విస్తరించుకున్నప్పుడే మనుగడ సాధించగలరన్నారు. అనంతరం ప్రోగ్రెస్ సాఫ్ట్ వేర్ కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ లోగనాధన్, prinesoftinic .com సీఈవో నాగరాజు ఆళ్ళ, ఆంధ్రప్రదేశ్ ఐటీఏ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయానికి మూలసూత్రం అంటూ ఏమీ లేదని, ఒక నిర్దిష్ట పరిధిని దాటి ముందుకు వెళ్లకపోవడమే అవరోధమని, దానిని దాటి వినూత్నంగా ఆలోచించిన వారు విజేతలుగా నిలుస్తారన్నారు. ప్రపంచం వెంట పరిగెత్తడం కాదని, ప్రపంచాన్ని మీ వెనుక పరుగెత్తే విధంగా నూతన ఆలోచనలతో సృజనాత్మకతను పెంపొందించుకోవాలన్నారు. సమస్య అనేది ఉత్పన్నం కాకపోతే మీలో దాగి ఉన్న సృజనాత్మకత శక్తి బయటకు రాదని, మీలో ఉన్న సృజనాత్మక ఆలోచనలకు పదునుపెట్టి ఉద్యొగం కోసం ఎదురు చూడకుండా వందలాది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రముఖులు ఇచ్చిన సమాధానాలతో సాగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపి విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.             

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us