జిల్లా పరిషత్ ఛైర్మన్ గా జ్యోతుల నవీన్ కుమార్

UPDATED 1Oth JULY 2017 MONDAY 8:00 PM

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ తాత్కాలిక ఛైర్మన్ గా జోత్యుల నవీన్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉన్న నామన రాంబాబు, వైస్ ఛైర్మన్ పెండ్యాల నళినికాంత్ లు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి విదితమే. ఛైర్మన్ రాజీనామాతో ఖాళీ అయిన పదవిలో తాత్కాలిక ఛైర్మన్ గా జగ్గంపేట జడ్పీటీసీ సభ్యుడు జోత్యుల నవీన్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. జిల్లా ప్రజా పరిషత్ తాత్కాలిక ఛైర్మన్ గా నవీన్ కుమార్ జూలై 15 వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ వైస్ ఛైర్మన్ గా పెండ్యాల నళినీకాంత్ పేరును తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్టు ఆయన తెలియజేశారు. నళినీకాంత్ కూడా జిల్లా ప్రజాపరిషత్ వైస్ ఛైర్మన్ గా జూలై 15 వ తేదీనే పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని చినరాజప్ప పేర్కొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us