UPDATED 25th JUNE 2017 SUNDAY 7:00 PM
పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి సన్నిధిలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాథం ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి వుండాలని తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందచేశారు. దేవస్థానం ఎదురుగా రూ.10 లక్షలు వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.







