పోలీసులకు చిక్కిన విద్యార్థులు

గుంటూరు (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: చెడు వ్యసనాలకు బానిసైన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడిపేందుకు గుంటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం బ్రాడీపేట నాలుగో లైనులో ఓ లాడ్జిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, 3 ఎల్‌ఎస్‌డీ స్రిప్పులు, రూ.8వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడుపుదామని గుంటూరు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వీరికి డ్రగ్స్‌ విక్రయించిన హైదరాబాద్‌కు చెందిన రేవంత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల అరెస్టు వివరాలను డీఎస్పీ సుప్రజ మీడియా సమావేశంలో వివరించారు. విద్యార్థుల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోరారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us