Ap News : మాస్క్ లేకపోతే జరిమానా.. ప్రచారంపై స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ

అమరావతి (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : బస్సుల్లో మాస్కు ధరించకుంటే జరిమానా ప్రచారంపై ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది. బస్సుల్లో మాస్కు లేకుంటే జరిమానా వేయడం లేదని స్పష్టం చేసింది. అయితే బస్సుల్లో మాస్కు ధరించాలని చెబుతున్నట్లు పేర్కొంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాస్కు ధరించాల్సిందిగా సూచిస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బస్టాండ్లలో మాస్కు లేకుండా తిరుగుతున్న వారికే జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధం నో పార్కింగ్ జోన్లో బైకులు, వాహనాలు నిలిపి ఉంచిన వారికి, బస్టాండ్ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న వారికి జరిమానా వేస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో మాస్కులు తప్పక ధరించాలని అవగాహన కల్పిస్తున్నామని ఈడీ బ్రహ్మనంద రెడ్డి వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us