Updated 11th August 2023 Friday 2:55 pm
Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawankalyan) చేపట్టిన వారాహి యాత్ర (Varahi Yatra) లో భాగంగా మూడో విడత విశాఖపట్టణం ( Visakhapatnam) లో ప్రారంభమైంది. అయితే, ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను శుక్రవారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) ఒక ప్రకటనలో విడుదల చేశారు. అంతకుముందు విశాఖపట్టణంలో వారాహి విజయ యాత్రపై నాదెండ్ల మనోహర్ విశాఖకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమై శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీ ఒక్కరినీ అభినందించారు.
వారాహి యాత్ర షెడ్యుల్ విడుదల ఇలా..
– ఈరోజు సాయంత్రం 3 గంటలకు భీమిలి నియోజకవర్గంలోని రుషికొండను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు.
– 12వ తేదీ ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి పవన్ వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు.
– 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సిఎస్బిసి ల్యాండ్స్ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
– 13వ తేదీ వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
– 14వ తేదీ ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు పవన్ వెళ్తారు. అక్కడ ఆక్రమణకు గురైన 600 ఎకరాల భూములను సందర్శిస్తారు.
– 15వ తేదీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
– 16వ తేదీ విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తారు.
– 17వ తేదీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.







