TTD: టీటీడీలో ఉద్యోగాల పేరుతో రూ. కోటిన్నర కాజేశారు

UPDATED 12th SEPTEMBER 2022 MONDAY 03:00 PM

TTD: టీటీడీలో శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన కేసులో తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యోగుల పాత్ర వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అనే వ్యక్తితో తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యోగులు ముగ్గురు కలిసి.. 17 మంది నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. కోటిన్నర వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాలకృష్ణను విచారించడంతో నగరపాలక సంస్థ ఉద్యోగుల భాగస్వామ్యం బయటపడింది. పిచ్చాటూరు ప్రాంతానికి చెందిన బాలకృష్ణ తిరుపతిలో నివాసముంటూ అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో పరిచయాలు పెంచుకుని అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

ఈ కేసులో నగరపాలక సంస్థ శానిటరీ ఇన్ స్పెక్టర్ వెంకటరత్నం, కమిషనర్ కారు డ్రైవర్ హేమంత్ తో పాటు అతడి బావమరిది శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో రూ. కోటిన్నర వసూలు చేసినట్లు గుర్తించిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us