BCCI: అండర్ - 19 ప్రపంచకప్‌కు భారత జట్టు.. వైస్‌ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు

ముంబయి (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: వెస్టిండీస్‌లో జరిగే ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్‌ పోటీలకు భారత జట్టును బీసీసీఐ నేతృత్వంలోని ఆల్ఇండియా జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ప్రకటించింది. ప్రపంచకప్‌ కోసం 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఐదుగురిని సెలెక్ట్‌ చేసింది. కెప్టెన్‌గా యాష్ ధుల్‌, ఆంధ్రా ఆటగాడు షేక్‌ రషీద్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. 2022 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు పద్నాలుగో ఎడిషన్‌ ప్రపంచకప్‌ పోటీలు జరుగుతాయి. టోర్నమెంట్‌లో మొత్తం 48 మ్యాచ్‌లను ఐసీసీ నిర్వహిస్తోంది. వరల్డ్‌ కప్‌ కోసం 16 జట్లు పోటీ పడనున్నాయి. నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. అండర్‌ -19 గత ఎడిషన్‌ (2020)లో రన్నరప్‌ నిలిచిన టీమ్‌ఇండియా ఇప్పటి వరకు నాలుగు సార్లు కప్‌ను గెలుచుకుంది. 2000, 2008, 2012, 2018లో టైటిల్స్‌ను సాధించింది. ఇక 2016, 2020ల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ సారి కూడా టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌ యువ జట్టు ఉవ్విళ్లూరుతోంది. టీమ్‌ఇండియా జనవరి 15న దక్షిణాఫ్రికాతో, జనవరి 19న ఐర్లాండ్, జనవరి 22న ఉగాండాతో తలపడనుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us