UPDATED 6 FEBRUARY 2022 SUNDAY 06:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకు దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2వేల 690 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 11వేల 855 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69వేల 572 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28వేల 598 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. శనివారంతో(3,396 కేసులు) పోల్చుకుంటే ఆదివారం కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.







