Updated 6th February 2023 Monday 6:10 pm
TTD : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8న బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 11.30 నుంచి 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
11-02-2023 – ధ్వజారోహణం(మీనలగ్నం) – హంస వాహనం
12-02-2023 – సూర్యప్రభ వాహనం – చంద్రప్రభ వాహనం
13-02-2023- భూత వాహనం – సింహ వాహనం
14-02-2023 – మకర వాహనం – శేష వాహనం
15-02-2023- తిరుచ్చి ఉత్సవం – అధికారనంది వాహనం
16-02-2023 – వ్యాఘ్ర వాహనం – గజ వాహనం
17-02-2023- కల్పవృక్ష వాహనం – అశ్వ వాహనం
18-02-2023 – రథోత్సవం (భోగితేరు) – నందివాహనం
19-02-2023 – పురుషామృగవాహనం – కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం.
20-02-2023 – శ్రీ నటరాజ స్వామివారి సూర్యప్రభ వాహనం – త్రిశూలస్నానం – ధ్వజావరోహణం, రావణాసుర వాహనం.







