UPDATED 23rd FEBRUARY 2022 WEDNESDAY 07:20 PM
Brown Sugar: గుంటూరులో బ్రౌన్ షుగర్ కలకలం రేగింది. బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి శ్యామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్యామ్‌తో పాటు మరో తొమ్మిది మందిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. రెండు గ్రాముల బ్రౌన్ షుగర్, యాభై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
పది సెల్ ఫోన్లను సీజ్ చేశారు. గంజాయి వినియోగానికి ప్రత్యేకంగా తయారు చేసిన రెండు పెట్ బాటిల్స్‌ను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.







