ఎస్ఈబీలో ఇంటి దొంగలు..

* రహస్యంగా సారా టిన్లు అమ్మకం...?
* పట్టణంలో ఓసారా వ్యాపారికే విక్రయించినట్లు అనుమానం
* ఎస్ఈబీ సిబ్బంది పాత్రపై అనుమానాలు

UPDATED 17th OCTOBER 2020 SATURDAY 5:30 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక చర్యలను తీసుకుంది. దీని నిమిత్తం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులను దాటుకుని రాష్ట్రంలోనికి ప్రవేశించే అక్రమ మద్యాన్ని నిరోధించడం, రాష్ట్రం లోపల అక్రమ మద్యం తయారీని అరికట్టడం, మద్యం తయారీదారులపై ఉక్కుపాదాన్ని మోపడం వంటి చర్యలను ఈ కొత్తశాఖకు అప్పగించింది. అయితే కంచే చేను మేస్తే అన్న చందంగా పెద్దాపురం పట్టణంలో గల కొంతమంది స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సిబ్బంది తీరు తమ శాఖకు ఆదాయాన్ని తీసుకురావాల్సింది పోయి దొంగచాటుగా సొమ్ములను నొక్కేసి తమ జేబులో వేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 10వ తేదీన జిల్లావ్యాప్తంగా పోలీస్, ఎస్ఈబీ అధికారుల సమక్షంలో నాటుసారాను నిర్వీర్యం చేసే కార్యక్రమం నిర్వహించారు. సుమారు 26 వేల లీటర్ల పైగా నాటుసారాను ఎస్ఈబీ, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వీర్యం చేశారు. అయితే నాటుసారాను నిర్వీర్యం చేసిన అనంతరం సారా నిల్వకు ఉపయోగించే ప్లాస్టిక్ డబ్బాలు, డ్రమ్ములను ముక్కలు చేయాలి. అయితే అక్కడే కొంతమంది ఎస్ఈబీ సిబ్బంది తమ తెలివితేటలు ప్రదర్శించినట్లు తెలిసింది. జిల్లా అధికారులు వెళ్లిన తరువాత కొంతమేర సారాతో పాటు, సారా నిల్వకు ఉపయోగించే ప్లాస్టిక్ డబ్బాలు, డ్రమ్ములను పట్టణానికి చెందిన ఓసారా వ్యాపారికి రహస్యంగా విక్రయించి వచ్చిన సొమ్ములను తమ జేబులో వేసేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్ఈబీ సిఐ ఎం.ఆర్.కె. దాస్ ను వివరణ కోరగా సారాతో పాటు ప్లాస్టిక్ డబ్బాలను, డ్రమ్ములను కూడా నిర్వీర్యం చేసేశామని చెప్పడం విశేషం.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us