శ్రీవారి దర్శనానికి టీటీడీ సన్నాహాలు

తిరుమల,28 మే 2020 (రెడ్ బీ న్యూస్): శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించగానే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకోనుంది. క్యూలైన్లలో ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లలో భక్తులు ఆరు అడుగుల మేర భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అలిపిరి వద్దే థర్మల్ స్క్రీనింగ్‌ చేసి తర్వాతే తిరుమలకు అనుమతి ఇవ్వనున్నారు. క్యూలైన్లలో నిరంతరం శానిటేషన్‌కు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us