Roja slams Pawan Kalyan : పవన్ శ్వాస తీసుకోవాలో.. వద్దో చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్ : రోజా

Updated 10th December 2022 saturday 7:40 pm

Roja slams Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో తన పర్యటనలను అడ్డుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తన ‘వారాహి’ వాహన రంగుపై అభ్యంతరాలు చెబుతోందని, ఇక శ్వాస పీల్చుకోవడం కూడా ఆపేయమంటారా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసిన సెటైర్ కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ ఏపీలో ఉంటే తాము సమాధానం చెప్పేవాళ్లమని, కానీ ఆయన తెలంగాణలో ఉన్నారని చెప్పారు.

పవన్ శ్వాస తీసుకోవాలో.. వద్దో చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్” అని రోజా అన్నారు. పవన్ కల్యాణ్ సిద్ధం చేసుకున్న ఎన్నికల ప్రచార వాహనం పేరు ‘వారాహి’ కాదని ‘నారాహి’ అని ఎద్దేవా చేశారు. అలాగే, కత్తులతో ఎవరితో యుద్ధం చేయాలో పవన్ కల్యాణ్ కు తెలియడం లేదని చెప్పారు. పవన్ కల్యాణ్ ఎవరి సైన్యంలో దూరి యుద్ధం చేయాలని భావిస్తున్నారని ఆమె నిలదీశారు.

ఏపీలోని 175 స్థానాల్లో జనసేన కనీసం అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉందని ఆమె విమర్శించారు. పవన్ కల్యాణ్ ను దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ ఆమె అన్నారు. పవన్ కల్యాణ్ కల్యాణ్ కు రాష్ట్ర ప్రజలపై, జనసేనపై ప్రేమ లేదని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, పవన్ కల్యాణ్ ‘వారాహి’ పేరుతో ఎన్నికల ప్రచార వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే దాని ట్రయల్ రన్ ను పరిశీలించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us