Chandrababu: కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తా: చంద్రబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారని, వారిని ఏరిపారేస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలో ఇకపై సమర్థులకే పట్టం కడతామన్నారు. తనను మెప్పించడం కాదని, ప్రజల్లోకి వెళ్లి పనిచేసే వారికే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అధికారంలోకి రాగానే అరాచకశక్తులు చేసిన పనులను వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. బాంబులకే భయపడలేదని, రాజకీయ నేరగాళ్లకు భయపడతామా అని ప్రశ్నించారు. స్థానిక నాయకుల అతి విశ్వాసం వల్లే కుప్పంలో ఓటమి పాలయ్యామన్న చంద్రబాబు.. వార్డుల వారీగా రహస్య నివేదికలు ఇవ్వాలని అభ్యర్థులను ఆదేశించారు. కుప్పంలో పార్టీ పటిష్టానికి సమర్థులైన నాయకులతో కో-ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల రోజు మహిళల పోరాట పటిమకు చంద్రబాబు కితాబిచ్చారు. కుప్పం నేతలతో దాదాపు 3గంటల పాటు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us