UPDATED 19th APRIL 2018 THURSDAY 6:30 PM
పెద్దాపురం: ల్యాండ్ కన్వర్షన్ విజిలెన్స్ పెండింగ్ కేసుల బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని డివిజన్ లోని తహసీల్దార్లను ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహశీల్దార్లతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ వ్యవసాయేతర భూముల పెండింగ్ కేసుల బకాయిలను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని తెలిపారు. కుల, పుట్టుక రెవెన్యూకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు జారీలో ఏ విధమైన జాప్యం లేకుండా ఉండాలన్నారు. రేషన్ కు సంబంధించి తహసీల్దార్లు తరచూ రేషన్ దుకాణాలను తనిఖీ చేసి నివేదిక పంపాలన్నారు. నీటితీరువా బకాయిల వసూళ్ళు వేగవంతం చేయాలన్నారు. అనంతరం డివిజన్ కు సంబంధించిన రెవెన్యూ అంశాల ప్రగతి మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో పెద్దాపురం తహసీల్దార్ గోగుల వరహాలయ్య, డివిజన్ లోని తహసీల్దార్లు పాల్గొన్నారు.







