SSMB28: టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ల్యాండ్ అవుతున్న బాబు.. మామూలుగా ఉండదట!

Updated 19th April 2023 Wednesday 5:50 pm

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందా.. ఈ సినిమాతో మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా నుండి నెక్ట్స్ అప్డేట్‌ను మే 31న ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ అప్డేట్ ఏమిటనే విషయంపై తాజాగా చిత్ర వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. మే 31న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు త్రివిక్రమ్ మార్క్ పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ పాత్రను కూడా చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us